Upasana : మెంటల్ హెల్త్ బాగుండటానికి ఉపాసన ఏం టిప్స్ చెప్పిందో తెలుసా??

Kaburulu

Kaburulu Desk

December 11, 2022 | 04:27 PM

Upasana : మెంటల్ హెల్త్ బాగుండటానికి ఉపాసన ఏం టిప్స్ చెప్పిందో తెలుసా??

Upasana : మెగాస్టార్ చిరంజీవి గారి కోడలు, స్టార్ హీరో రామ్ చరణ్ భార్యగా కొణిదెల ఉపాసన అందరికి తెలుసు. అయితే తనకంటూ వ్యక్తిగతంగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. అపోలో బాధ్యలతో పాటు, సోషల్ సర్వీస్ లలో ఎంతో యాక్టీవ్ గా పాల్గొంటూ, హెల్త్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటుంది. ఇక తన యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా హెల్త్ కి సంబంధించిన సూచనలు ఇస్తుంది ఉపాసన.

ఇందులో భాగంగానే ఉపాసన తాజాగా మెంటల్ హెల్త్ బాగుండాలంటే మనం ఏ విధంగా ఉండాలో ఒక ట్వీట్ చేసింది. ఈ మధ్య కాలంలో అందరూ కూడా మెంటల్ గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. కాబట్టి మెంటల్ హెల్త్ పై ఉపాసన ట్వీట్ చేసింది.

Happy Tips : రోజంతా ఉత్సాహాన్ని కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?

ఉపాసన తన ట్వీట్ లో.. మెంటల్ హెల్త్ బాగుండాలంటే సమయానికి తినేలా చూసుకోవాలి, మంచి నిద్ర ఉండాలి, ప్రశాంతంగా ఉండటానికి చూడాలి, అలాగే రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి అని తెలిపింది. అలాగే తాను మెంటల్ హెల్త్ బాగుండటానికి అన్ని విషయాల్లోనూ చాలా కామ్ గా ఉంటానని, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఎదుర్కోవడానికి ట్రై చేస్తానని తెలిపింది.