Health Tips: ఈ ఒక్క ఫ్రూట్ తింటే చాలు. చాలా రకాల అనారోగ్య సమస్యలకి చెక్ పెట్టేయచ్చు.

Health Tips: గుండె సంబంధిత వ్యాధులు, అధిక బరువు తో వచ్చే సమస్యలని అవకాడో ఫ్రూట్ తో చెక్ పెట్టేయచ్చు.

Kaburulu

Kaburulu Desk

December 20, 2022 | 09:44 PM

Health Tips: ఈ ఒక్క ఫ్రూట్ తింటే చాలు. చాలా రకాల అనారోగ్య సమస్యలకి చెక్ పెట్టేయచ్చు.

Health Tips: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఏదోక రకంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఎక్కువగా గుండె సంబంధిత సమస్యలు, అధిక బరువు, జీర్ణ సమస్యలు, డయాబేటీస్ ఇవే కాకుండా ఎక్కువ వయస్సు గల వారు అయితే ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు కీళ్ల సమస్యల నుండి ఇబ్బంది పడుతున్నారు.
ఇలాంటి సమస్య నుండి కొంత వరకి అవకాడో ఫ్రూట్ తినడం వల్ల ఉపశమనం పొందవచ్చు. ఒక్క అవకాడో ఫ్రూట్ లో 13 గ్రామ్స్ కార్బో హైడ్రైట్స్, 3 గ్రామ్స్ ప్రోటీన్స్, 22 గ్రామ్స్ గుడ్ ఫ్యాట్, 10 గ్రామ్స్ ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటాయి.ఈ అవకాడో ఫ్రూట్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల లాభాలు చేకూరుతాయి.

Benefits of Avacodo:
1. అవకాడో ఫ్రూట్ కాన్సర్ వ్యాధిని తగ్గించడం లో సహాయం చేస్తుంది
2. బరువు తగ్గడానికి ఈ పండు చాలా ఉపయోగ పడుతుంది. ఇందులో కొవ్వును కరిగించే గుణాలతో పాటు, ఫైబర్, ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వు ఉంటుంది.
3. Type-2 డయాబేటీస్ని అదుపులో ఉంచడంలో సహాయం చేస్తుంది. గ్లూకోస్ లెవెల్స్ అదుపులో ఉండేలా ఉంచుతుంది.
4. జీర్ణ శక్తినీ పెంచుతుంది.
5. రోజులో శరీరానికి కావాల్సిన ఫైబర్ చేకూరేలా చేస్తుంది.
6. చర్మాన్ని తాజాగా ఉంచడంలో సహాయం చేస్తుంది.
7. జుట్టు పెరగడంలో సహయం చేస్తుంది.
8. బిపిని నియంత్రించడంలో సహకరిస్తుంది.
9. ఆర్థరైటిస్ తగ్గిచడంలో ఉపయోగపడుతుంది.
10. కంటి చూపును మెరుగుపరుస్తుంది.
అంతేకాకుండా బ్రైన్ హెల్త్ని కాపాడుతుంది. అల్జీమర్స్కి చక్కటి ఫుడ్ అవకాడో.