Site icon Kaburulu

Stress Ball : స్ట్రెస్ బాల్ వాడండి.. ఎంత రిలాక్స్ గా ఉంటుందో తెలుసా??

Benefits of using Stress Ball

Benefits of using Stress Ball

Stress Ball :  మనలో ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవడానికి మనం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అలంటి వాటిల్లో స్ట్రెస్ బాల్ ను ఉపయోగించుకోవడం ఒకటి. దీని వలన మనలోని ఒత్తిడి తగ్గడమే కాకుండా ఆరోగ్యపరమైన లాభాలను పొందవచ్చు. స్ట్రెస్ బాల్ ప్రెస్ చేయడం వలన మనలోని అనవసరమైన హార్మోన్లను తగ్గించి ఒత్తిడిని కంట్రోల్ లో ఉంచుతుంది. స్ట్రెస్ బాల్ ఉపయోగించడం వలన ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.

* స్ట్రెస్ బాల్ ప్రెస్ చేయడం వలన రక్త ప్రసరణ బాగా జరిగి గుండె పోటు, అధిక రక్తపోటు వంటివి రావడాన్ని నివారిస్తుంది.
* స్ట్రెస్ బాల్ ప్రెస్ చేయడం వలన మనసు ప్రశాంతంగా మారుతుంది. మనలోని చెడు ఆలోచనలు దూరం అవుతాయి.
* మీరు పనిలో అలసిపోయినట్లుగా అనిపించినా స్ట్రెస్ బాల్ ని ప్రెస్ చేస్తే మీకు ఎంతో రిలాక్స్ గా అనిపిస్తుంది.
* టైపింగ్ చేయడం, రాయడం, సంగీత వాయిద్యాలు వాయించడం వలన చేతి వేళ్ళు నొప్పులు పుడతాయి. స్ట్రెస్ బాల్ ప్రెస్ చేస్తే చేతి వేళ్ళకు మంచి వ్యాయామం జరిగి నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.
* స్ట్రెస్ బాల్ ఉపయోగించడం వలన మనలోని ఏకాగ్రత, సృజనాత్మకత మెరుగుపడుతుంది.
* స్ట్రెస్ బాల్ నొక్కినప్పుడు నరాలు, కండరాలు సంకోచించి బలంగా మారతాయి.
* స్ట్రెస్ బాల్ ఉపయోగించడం వలన ఒత్తిడి తొలగిపోయి నిద్ర కూడా బాగా పడుతుంది.

అందుకే మీరు ఒత్తిడిగా ఫీల్ అయినప్పుడు, మానసిక సమస్యలతో ఉంటే స్ట్రెస్ బాల్ ని రోజూ వాడండి.

Exit mobile version