Breaking : Vani Jayaram : సీనియర్ గాయని పద్మభూషణ్ వాణీ జయరాం కన్నుమూత..

కొద్దిసేపటి క్రితమే అనేక తెలుగు సినిమాల్లో కొన్ని వందల పాటలు పాడిన సీనియర్ గాయని, పద్మభూషణ్ వాణీ జయరాం కన్నుమూశారు. దీంతో మరోసారి టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది...............

Kaburulu

Kaburulu Desk

February 4, 2023 | 03:14 PM

Breaking : Vani Jayaram : సీనియర్ గాయని పద్మభూషణ్ వాణీ జయరాం కన్నుమూత..

Vani Jayaram :  ఇటీవల టాలీవుడ్ లో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. ఒకరి మరణం మరవకముందే మరో మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోతుంది. ఇటీవలే రెండు రోజుల క్రితమే కళాతపస్వి విశ్వనాధ్ గారు కన్నుమూశారు. ఆ బాధ నుంచి బయటకి రాకముందే ఇవాళ ఉదయం సీనియర్ నిర్మాత గురుపాదం కన్నుమూశారు. తాజాగా కొద్దిసేపటి క్రితమే అనేక తెలుగు సినిమాల్లో కొన్ని వందల పాటలు పాడిన సీనియర్ గాయని, పద్మభూషణ్ వాణీ జయరాం కన్నుమూశారు. దీంతో మరోసారి టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది.

1945 నవంబరు 30న తమిళనాడు వేలూరులో ఓ సంగీత కుటుంబంలో జన్మించిన వాణీ జయరాం చిన్నప్పటి నుండే సంగీతం నేర్చుకున్నారు. ఇంట్లో సినిమా పాటలు వద్దన్నా ఆమెకు సినిమా పాటలు పాడాలని కోరిక ఉండేది. వాణీ జయరాం పదేళ్ల వయసు నుంచే ప్రదర్శనలు ఇవ్వడంమొదలుపెట్టింది. జయరాం అనే వ్యక్తితో పెళ్లి జరిగిన తర్వాత ఆమె భర్త ప్రోత్సహించడంతో సినిమాల్లో పాటలు పాడటం మొదలుపెట్టారు.

మొదటగా 1970లో బాలీవుడ్ ‘గుడ్డీ’ సినిమాలో ‘బోలే రే’ అనే పాట పాడగా అది పెద్ద హిట్ అయింది. దీంతో వాణీ జయరాంకు వరుస ఆఫర్స్ వచ్చాయి. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురీ..లాంటి దాదాపు 14 భాషల్లో సినిమాలకు పాటలు పాడారు వాణీ జయరాం. తమిళ్ లో బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అపూర్వ రాగంగళ్‌’, తెలుగులో K విశ్వనాథ్ శంకరాభరణం సినిమాలతో ఆమె పేరు మారుమ్రోగిపోయింది. దీంతో అవార్డులు కూడా వరించాయి. తెలుగులో మరోచరిత్ర, వయసు పిలిచింది, మంగమ్మ గారి మనవడు, స్వాతికిరణం, శృతి లయలు, స్వర్ణకమలం, సీతాకోక చిలుక..లాంటిఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో పాటలు పాడి ప్రేక్షకులని మెప్పించారు వాణీ జయరాం.

Michael Review : కొత్త ఎలివేషన్స్, మ్యూజిక్ తోనే.. పాత కథని ప్రేక్షకుల ముందు పెట్టిన మైఖేల్..

14 భాషల్లో దాదాపు 8వేలకు పైగా పాటలు పాడిన వాణీ జయరాం అనేక అవార్డులు అందుకున్నారు. కొన్ని రోజుల క్రితమే ఆమెకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది కేంద్రప్రభుత్వం. 2018 లో ఆమె భర్త జయరాం మరణించగా అప్పట్నుంచి సినీ పాటలకు మెల్లిమెల్లిగా దూరం అవుతూ వచ్చింది. తాజాగా నేడు ఫిబ్రవరి 4న ఉదయం ఆమె స్వగృహంలో కన్నుమూశారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, సంగీతాభిమానులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.