World Biggest Sri Ranga Murthy Temple:ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీరంగ మూర్తి విగ్రహం ఉన్న దేవాలయం ఏదో తెలుసా…?

Kaburulu

Kaburulu Desk

December 20, 2022 | 11:00 PM

World Biggest Sri Ranga Murthy Temple:ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీరంగ మూర్తి విగ్రహం ఉన్న దేవాలయం ఏదో తెలుసా…?

ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీరంగ మూర్తి విగ్రహం ఉన్న దేవాలయం ఎక్కడుందో, ఆ దేవాలయం విశిష్టత ఏంటో, ఇపుడు తెలుసుకుందాం. తమిళనాడులోని తీరుచురాపల్లిలో గల సుమారు 157 ఎకరాలలో విస్తరించిన 4 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగి ఉన్న శ్రీరంగం శ్రీమహావిష్ణువు దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. గుడి ప్రాంగణంలో 50 పైచిలుకు దేవత మూర్తుల ఆలయాలు, విశ్రాంతి గదులు, వాణిజ్య సముదాయాలు ఉన్నాయి.

విష్ణుభగవానుడిని 108 దివ్య క్షేత్రాలలో ఇదే మొదటిది మరియు స్వయంభూ క్షేత్రం కూడా. శ్రీరంగం శ్రీమహావిష్ణువు దివ్యక్షేత్రాలలో మొదటిది మరియు ముఖ్యమైనదిగా ఈ దేవాలయాన్ని భావిస్తాం. విష్ణువు పాలసముద్రం నుండి ఈ ప్రదేశంలోనే ఉద్భవించాడని స్థల పురాణాలు చెబుతున్నాయి. దీనిని ప్రపంచములో ఉన్న అతిపెద్ద విష్ణు దేవాలయంగా కూడా ప్రజలు చెబుతారు.

భూలోక వైకుంఠం, ఆలయాల ద్వీపం, తిరువరంగన్ అనేవి శ్రీరంగం క్షేత్రానికి గల ఇతర పేర్లు. శ్రీరంగం ఆలయాన్ని “ఇండియన్ వాటికన్” అని కూడా పిలుస్తారు. వాటికన్ అంటే ఉద్యానవనము అని అర్థం. అంటే వాటికన్ నగరంగా ప్రసిద్ధి చెందిన రోమ్ నగర ప్రాంతంలోని నగరానికి ఉపమానంగా ఈ దేవాలయాన్ని చెబుతారు. ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి కదూ ఈ ఆలయ విశేషాలు…. మరి మీరూ వెళ్ళినపుడు అక్కడి ప్రాంతాలను దర్శించండి… ఆసక్తికరమైన విషయాలను వీక్షించండి.