Varadaraja Perumal:బంగారు బల్లిని పూజించే దేవాలయమేదో తెలుసా…!

Kaburulu

Kaburulu Desk

December 19, 2022 | 11:16 PM

Varadaraja Perumal:బంగారు బల్లిని పూజించే దేవాలయమేదో తెలుసా…!

భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు. మనదేశంలోని అనేక దేవాలయాలలొనే మన సాంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడుతుంది. ప్రత్యేకంగా తమిళనాడు రాష్ట్రంలో అనేక దేవాలయాలు వెలిశాయి. తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న పెరుమాళ్ వరదరాజ దేవాలయంలో ఈ బంగారు బల్లిని పూజించే సాంప్రదాయం ఒకటి కొనసాగుతుంది. అనాదిగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని, సంస్కృతిని ప్రజలు అత్యంత భక్తితో పాటిస్తారు. ఈ సంస్కృతిని గురించిన మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక్కడ బల్లిని పూజించడం వెనక గల పురాణ కథ ఏమిటో చూసినట్లయితే… గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు. వారు గురువు గారి దేవతార్చనకు కావలసిన పుష్పాలు, ఫలాలు, నీరు ఏర్పాటు చేస్తుండే వారు. ఒకనాడు వారు పెట్టిన నీటి పాత్రలో ఒక బల్లి పడింది. ఆగ్రహించిన మహర్షి వారిని బల్లులుగా జీవించమని శపించారు. తెలియకచేసిన తప్పుకు క్షమించమని వేడుకొనగా ఆయన వారిని అత్తిగిరి క్షేత్రం వెళ్లి స్వామిని సేవిస్తే శాప విమోచన గలుగుతుందని తెలిపారు. కొంతకాలానికి ఇంద్రుడు సూర్యచంద్రులతో కలిసి శ్రీ వరదరాజ పెరుమాళ్ దర్శనానికి తరలి వచ్చాడు. వారి దర్శనంతో శిష్యులకు శాపవిమోచనం లభించినది. నాటినుండి వారి విగ్రహాలు బల్లి రూపంలో మారిపోయాయి. వారిని దర్శించు కున్న భక్తుల పాపాలను తొలగిపోతారని వారి నమ్మకం.

ఎంతో ఆసక్తికరంగా ఉంది కదూ…! మరి మీరూ తమిళనాడు వెళ్లినపుడు కాంచీపురాన్ని దర్శించి అక్కడి పెరుమాళ్ వరదరాజ ఆలయంలో గల బంగారు వెండి బల్లుల దర్శనము చేసుకోండి…!