Release Srivari Arjitha seva tickets:డిప్ ద్వారా భక్తులకు శ్రీవారి సేవా టికెట్లు. ఎప్పటినుండంటే…?

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడమే మహా భాగ్యంగా తలిచే భక్తులు ఆ శ్రీవారి ఆర్జిత సేవలో పాల్గొనటం గొప్ప అదృష్టంగా, పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. కాబట్టి దానికి సంబంధించిన దరఖాస్తులు, టికెట్లు వంటివి ఎప్పటి నుండి కల్పిస్తారనేది టిటిడి స్పష్టం చేసింది. ఆలస్యం చేయకుండా ఆ వివరాలేమిటో తెలుసుకుందాం…
తిరుమల శ్రీవారి ఆలయంలో టిటిడి నిర్వహించే కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవలకు సంబంధించిన వర్చువల్ సేవ, వంటి దర్శన టికెట్లు, సేవా టిక్కెట్లు భక్తులకు 14వ తేదీ మధ్యాహ్నం నుండి డిప్ ద్వారా కేటాయించనున్నారు.
జనవరి నెలకు సంబంధించి స్వామివారి ఆర్జిత సేవా టికెట్లను ఈనెల 12న విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఆరోజు ఉదయం10 గంటల నుంచి 14వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు భక్తులకు అవకాశం కల్పించి. 14వ తేదీ మధ్యాహ్నం డిప్ ద్వారా భక్తులకు సేవా టిక్కెట్లు టీటీడీ కేటాయింబోతుంది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి టీటీడీ అధికారిక వెబ్సైట్లో శ్రీవారి ఆర్జిత సేవలను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. నకిలీ వెబ్సైట్ల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని భక్తులకు హెచ్చరించింది.