Sri Vani Tickets: శ్రీ వాణి టికెట్లపై వచ్చిన ఈ తాజా సమాచారం విన్నారా…?

Kaburulu

Kaburulu Desk

December 21, 2022 | 03:27 PM

Sri Vani Tickets: శ్రీ వాణి టికెట్లపై వచ్చిన ఈ తాజా సమాచారం విన్నారా…?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టిటిడి శుభవార్త తెలిపింది. శ్రీ వాణి ఆన్లైన్ టికెట్ల విడుదల కార్యక్రమాన్ని రేణిగుంట విమానాశ్రయంలో, ఇంకా ఇతర ప్రముఖ స్థలాల్లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇపుడు టికెట్ల విడుదలకు సంబంధించి డిసెంబర్ 22న శ్రీవాణి టిక్కెట్ల ఆన్‌లైన్ కోటా విడుదల చేస్తున్నట్టు టిటిడి తెలిపింది.

తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం శ్రీవాణి టికెట్ల ఆన్‌లైన్ కోటాను డిసెంబర్ 22వ తేదీ ఉదయం 9 గంటలకు టిటిడి విడుదల చేస్తామని, రోజుకు 2000 శ్రీవాణి టికెట్లను విడుదల చేస్తామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, శ్రీవారి వైకుంఠద్వార దర్శనం ద్వారా భక్తి పారవశ్యంలో మునిగిపోవడానికి ఇది చక్కటి అవకాశమని టిటిడి తెలిపింది.

ప్రతిరోజూ 2000 టికెట్ల చొప్పున ఆన్లైన్ లో విడుదల చేయనున్నారు. శ్రీవారి భక్తులు శ్రీవాణి ట్రస్ట్ కు పదివేల రూపాయల విరాళం ఇవ్వడంతో పాటు మూడువందల రూపాయల దర్శన టికెట్ ని కొనుగోలు చేయాలి. ఆన్లైన్ లో ఈ టికెట్లను పొందిన భక్తులకు జయ విజయుల వద్ద నుండి మహాలఘు దర్శనం కూడా ఉంటుందని టిటిడి తెలిపింది. భక్తులు ఈ తాజా విషయాన్ని గమనించి వైకుంఠ ద్వారా దర్శనాన్ని చేసుకోవాలని టిటిడి తెలిపింది.