Ameenpear Dargah:దక్షిణ అజ్మీర్ దర్గా ఏదో తెలుసా మీకు?

Kaburulu

Kaburulu Desk

December 8, 2022 | 10:43 PM

Ameenpear Dargah:దక్షిణ అజ్మీర్ దర్గా ఏదో తెలుసా మీకు?

కుల మతాలకు అతీతంగా ఇస్లాం సూఫీ తత్వాన్ని బోధిస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనను పెంచుతున్న దర్గాలు చాలా ఉన్నా అందులో కొన్ని మాత్రమే పేరుపొందిన దర్గాలు ఉంటాయి. అలాగే దక్షిణ భారత అజ్మీర్ దర్గాగా పేరుగాంచిన కడప అమీన్ పీర్ దర్గా యొక్క ప్రాముఖ్యత గురించి అద్భుతమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

కర్ణాటకలోని బీదర్ ప్రాంతంలో 16వ శతాబ్దంలో మహాప్రవక్త వంశీయులైన ఖ్వాజాయే ఖాజుగా నాయబే రసూల్ అతయే రసూలుల్లాహ్ హాజరత్ ఖ్వాజా సయ్యద్షా పీరుల్లా మాలిక్ సాహెబ్ వారు వారి కుటుంబ సమేతంగా వచ్చి ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక బోధనలు నిర్వహించేవారు. వీరి ఆధ్యాత్మిక పాండిత్యానికి ఆకర్షితులైన అప్పటి నిజాం నవాబులు వీరిని ఇక్కడే నివసించమని కోరగా వారు ఇక్కడే జీవిత చారమాంకం వరకు గడిపి సమాధయ్యారు. అలా మహా ప్రవక్త వంశానికి చెందిన గురువుల సమాధులు ఇక్కడ ఉండటం వలన ఈ స్థలం అత్యంత పవిత్రమైనదిగా భక్తులు భావిస్తుంటారు. ప్రతి సంవత్సరం ఈ దర్గాలో ఉర్సు, గంధం ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతియేటా నిర్వహించే మాదిరిగానే ఈ సంవత్సరం కూడా డిసెంబరు 7 నుండి 12వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతున్నాయి.

ఈ దర్గాకు 10వ పీఠాధిపతి అయిన హజరత్ అమీనుల్లా హుస్సేనీ సాహెబ్ పేరు మీదుగా అమీన్ పీర్ దర్గా అనే పేరు వచ్చింది. ఈ దర్గా ప్రస్తుతం 11వ పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్షా ఆరీఫుల్లా హుసేని సాహెబ్ ఆధ్వర్యంలో ఉంది.