Shiromundanam: కుటుంబ సభ్యులలో ఎవరైనా చనిపోతే శిరోముండనం ఎందుకు చేసుకుంటారు?

Kaburulu

Kaburulu Desk

December 22, 2022 | 07:11 PM

Shiromundanam: కుటుంబ సభ్యులలో ఎవరైనా చనిపోతే శిరోముండనం ఎందుకు చేసుకుంటారు?

కుటుంబ సభ్యులలో ఎవరైనా చనిపోతే శిరోముండనం (గుండు) ఎందకు చేసుకుంటారో, దాని వెనక ఉన్న శాస్త్రీయపరమైన కారణాలేమిటో, ఆధ్యాత్మ్మిక పరమైన కారణాలేమిటో ఇపుడు తెలుసుకునే ప్రయత్త్నం చేద్దాం… సాధారణంగా హిందూ సాంప్రదాయంలో తల్లిద్దంద్రులు లేదా కుటుంబ సభ్యులు చనిపోతే శిరోముండనం (గుండు) చేయించుకోవడం ఒక అనాదిగా వస్తున్న ఆచారం. అలా చేయించుకోకపోతే పితృ దేవతలకు శాంతి లభించందని కూడా ప్రజలు నమ్ముతారు.

ఈ ఆచారం పాటించడానికిగల ప్రధాన కారణం ఏమిటంటే అంత్యక్రియలను నిర్వహించడానికి శారీరకంగా మరియు మానసికంగా వారిని సిద్ధం చేయడమే. ఎవరైనా ఇతర ప్రజలు వారిని చూసినపుడు వారు ఏదో బాధలో ఉన్నారని తెలుసుకొని తదనుగుణంగా వారితో వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది. తద్వారా వారిపట్ల సానుభూతి కలిగేట్లు ప్రవర్తించడానికి ఉపయోగపడుతుంది.

కొంత ఆధ్యాత్మికపరంగా ఆలోచిస్తే… వెంట్రుకలు తామసిక స్వభావాన్ని సూచిస్తాయి. కుటుంబ సభ్యులు చనిపోయినపుడు వెంట్రుకలను తొలగించడం అనేది ప్రతీకాత్మకంగా వారిని స్వాభావిక అజ్ఞానం నుండి విముక్తి చేస్తుంది తద్వారా జ్ఞానాన్ని తొందరగా గ్రహించుకోగలుగుతారు. అలాగే చనిపోయినవారు వదిలిపెట్టిన కుటుంబ బాధ్యతలను, సమాజ బాధ్యతలను, వ్యక్తిగత బాధ్యతలను తాను స్వీకరించడానికి వారిని సిద్ధం చేస్తుంది.