Sabarimala:శబరిమల దర్శన వేళల్లో మార్పులు విన్నారా…?

Kaburulu

Kaburulu Desk

December 14, 2022 | 07:11 PM

Sabarimala:శబరిమల దర్శన వేళల్లో మార్పులు విన్నారా…?

ప్రసిద్ధ అయ్యప్ప స్వామి క్షేత్రమైన కేరళలోని శబరిమల భక్తులతో కిటకిటలాడుతుంది. అనేక మంది భక్తులు దర్శనం కోసం ముందస్తు ఆన్లైన్ టికెట్లు బుక్ చేస్తున్నారు. మకర సంక్రాంతి దగ్గర పడుతున్న కొద్ది భక్తుల రద్దీ మరింత పెరగనుంది. ప్రతిరోజూ లక్షకు పైగా భక్తులు స్వామి దర్శనం చేసుకుంటున్నారు. ఈ విపరీతమైన రద్దీని నియంత్రించే క్రమంలో రక్షణ సిబ్బందికి, ప్రజలకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు కేరళ సీఎం విజయన్ సమీక్ష నిర్వహించి కీలక ప్రకటన చేసారు.

రోజురోజుకూ శబరిమలలో పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కేరళ సీఎం పినరాయ్ విజయన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం నిర్వహించిన సమీక్ష ప్రకారం ప్రతిరోజూ 90వేల మంది భక్తులను మాత్రమే అనుమతించాలని కీలక విషయాన్ని ప్రకటించారు. ఈ నియమాన్ని అమలు చేసినట్లైతే రోజువారీ రద్దీని, ప్రజల సమస్యలను కొంత తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నిర్ణయాన్ని అమలు చేస్తూ దర్శన సమయాన్ని కూడా ఒక గంట పాటు పెంచనున్నట్లు సీఎం కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.