Importance of East:తూర్పు దిక్కుకు ఎందుకంత ప్రాముఖ్యం…?

Kaburulu

Kaburulu Desk

December 10, 2022 | 03:48 PM

Importance of East:తూర్పు దిక్కుకు ఎందుకంత ప్రాముఖ్యం…?

హిందూ సంస్కృతిలో, వాస్తు శాస్త్రంలో ఏ పని చేసినా తూర్పు దిక్కుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. తూర్పు దిక్కుకు గృహ ద్వారాన్ని అమర్చడం, తూర్పు దిక్కుకు తిరిగి నమస్కారం చేయడం వంటి చాలా ఆచారాలలో తూర్పు దిక్కుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకు అని ఆలోచిస్తే ఆధ్యాత్మికంగా, శాస్త్రీయ పరంగా కూడా అనేక కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే తప్పక చదివేయండి ఈ వ్యాసం.

వాస్తుశాస్త్రం ప్రకారం… ఒక్కో దిక్కుకు ఒక్కోరు దిక్పాలకులుగా నియమించబడి ఉంటారు. దక్షిణ దిక్కుకు యముడు దిక్పాలకుడైతే, తూర్పు దిక్కుకు సూర్యుడు దిక్పాలకుడు. కాబట్టి దక్షిణ దిక్కుకు ఉన్న ప్రాధాన్యత తక్కువైనా తూర్పు దిక్కుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. కారణం తూర్పు దిక్పాలకుడైన శక్తివంతమైన, లోకానికి వెలుతురునిచ్చే సూర్యభగవానుడు ప్రజలకు ఆరోగ్యాన్ని కలిగించడం.

శాస్త్రీయ పరమైన కారణాలు ఆలోచిస్తే… సూర్యుడు తూర్పు వైపు ఉదయిస్తాడు. ఎక్కడా లభించని డి విటమిన్ ఉదయపు సూర్యుడి కాంతిలో లభిస్తుంది. కారణం ఉదయం పూట సూర్యుడు భూమికి అత్యంత దూరంలో ఉండటం వల్ల సూర్యుడి నుండి వచ్చే ప్రమాదకరమైన కాంతి కిరణాలు భూమిని చేరకుండా, కేవలం ఆరోగ్యానికి మేలుకూర్చే కిరణాలు భూమిని చేరటం. ఉదయపు సూర్యకాంతిలో అధిక తరంగ ధైర్ఘ్యం గల ఎరుపు రంగు కాంతి మాత్రమే భూమిని చేరుతుంది. దీని వల్లనే డి విటమిన్ లభిస్తుంది. తద్వారా ఉదయం పూట సూర్యనమస్కారం చేయడం, సూర్యుడు ఉదయించే తూర్పు దిక్కు వైపుకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఆచారంలో భాగమైంది.