Ratha sapthami as Mini Brahmothsava 2023: ఒకే రోజు సప్తవాహనాలపై శ్రీవారు… ఎప్పుడంటే

Kaburulu

Kaburulu Desk

January 22, 2023 | 03:55 PM

Ratha sapthami as Mini Brahmothsava 2023: ఒకే రోజు సప్తవాహనాలపై శ్రీవారు… ఎప్పుడంటే

తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో జరిగే రథసప్తమి వేడుకలను మినీ బ్రహ్మోత్సవాలు అన్న పేరుతో పిలుస్తారు. కారణమేమంటే బ్రహ్మోత్సవాలకు సమానమైన వేడుకలు ఈ రోజున జరుపుతారు. సూర్య జయంతి సందర్భంగా తిరుమల తిరుపతి క్షేత్రంలో రథ సప్తమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని టీటీడీ సర్వం సిద్ధం చేస్తోంది. మరి ఆ వివరాలేంటో ఇపుడు తెలుసుకుందాం.

తెలుగు సంవత్సరంలో పదకొండవ నెల అయిన మాఘమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలం విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది. పూజలకు శుభకార్యాలకు మాఘ మాసం విశిష్టమైంది. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించిన తరువాత వచ్చే మాఘ శుద్ధ సప్తమి రోజును రథసప్తమిగా వేడుకలు నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. మాఘమాసంలో మాఘ శుద్ధ సప్తమిని ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు పుట్టిన రోజుగా భావించి అత్యంత ఘనంగా హిందువులు జరుపుకుంటారు.

ఈ నెల జనవరి 28 వ తేదీన రథసప్తమి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని  సూర్య భగవానుడు పూజలను అందుకుంటున్న అరసవెల్లి సహా అనేక ప్రముఖ పుణ్యక్షేత్రాలు రథ సప్తమి వేడుకలను సిద్ధం అవుతున్నాయి. సూర్య జయంతి సందర్భంగా తిరుమల తిరుపతి క్షేత్రంలో రథ సప్తమి వేడుకలను అత్యంత ఘనంగా టీటీడీ నిర్వహించడానికి సర్వం సిద్ధం చేస్తోంది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీనివాసునికి రథసప్తమి రోజుననే ఏడు వాహనాల సేవలను నిర్వహిస్తుంది టిటిడి పాలకమండలి. తిరుమాడ వీథులలో స్వామి వారు ఏడు వాహనాలలో ఊరేగుతారు. ఉదయం సూర్య ప్రభ వాహనంతో మొదలై రాత్రి చంద్ర ప్రభ వాహనంతో ముగుస్తుంది.