Ramnavami In Ayodhya: అయోధ్యలో రామనవమి విశేషాలేమిటో… అక్కడి ఏర్పాట్లు ఏమిటో తెలుసుకున్నారా?

Kaburulu

Kaburulu Desk

March 26, 2023 | 10:40 PM

Ramnavami In Ayodhya: అయోధ్యలో రామనవమి విశేషాలేమిటో… అక్కడి ఏర్పాట్లు ఏమిటో తెలుసుకున్నారా?

రామనవమిని హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దేశ వ్యాప్తంగా రాముడికి పూజా కార్యక్రమాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పిస్తారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో రాముడికి కళ్యాణ కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. ముఖ్యంగా రామ జన్మ భూమి ఆయోధ్యలోనైతే కన్నుల పండవగా వేడుకలు జరుగుతాయి. అయితే ప్రతి సంవత్సరం రామనవమి వేడుకలు మార్చి నెలలో వారం పాటు నిర్వహిస్తారు. ఇక ఈసారి అయోధ్యలో రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రామ నవమి మహోత్సవాన్ని ఈ నెల 21 నుంచి మార్చి 30 వరకు ఘనంగా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భజనతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేర్కొంది. ఈ వేడుకలు తాత్కాలిక ఆలయంలో శ్రీరాముడి చివరి జన్మదిన వేడుకలని కూడా ట్రస్ట్ తెలిపింది. రాబోయే జన్మదిన వేడుకలు కొత్తగా నిర్మిస్తున్న మందిరంలో జరగనున్నాయి.

రామజన్మోత్సవ వేడుకలు అయోధ్యలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న  వివిధ దేవాలయాలలో సాంస్కృతిక కార్యక్రమాలు వారం రోజుల పాటు కొనసాగనున్నాయి. అయితే ఇప్పటికే శ్రీరామున్ని ఉత్సవాల కోసం అందంగా అలంకరించిన ఫోటోలను ట్రస్ట్‌ విడుదల చేసింది. ఇప్పటికే భక్తులు ఆలయానికి భారీగా చేరుకుని పూజలు నిర్వహిస్తున్నారు.

రామజన్మోత్సవాన్ని 9 రోజుల పాటు ఎందుకు నిర్వహిస్తారో తెలుసా?:
రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ మాట్లాడుతూ.. శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్రంలో ఈ 9 రోజుల జనందోత్సవాలను నూతనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గత రెండు సంవత్సరాల పాటు కరోనా కేసుల కారణంగా ఆలయానికి భక్తులు రాలేకపోయారని, ఈ సంవత్సరం దేవుడి దయ వల్ల అంతా భాగుందని పేర్కొన్నారు. దీంతో భక్తులు రావడానికి ఎలాంటి ఆంక్షలు లేనందున ఈ సారి 9 రోజుల పాటు నిర్వహిస్తురని తెలిపారు. రామజన్మోత్సవాల గురించి ట్రస్ట్‌ కమిటీ నిర్వాహకులు గిరీష్‌పతి త్రిపాఠి కూడా మాట్లాడారు. న్న పిల్లల నుంచి మధ్య వయస్సు, వృద్ధాప్యం వరకు అయోధ్యలో శ్రీరాముడిని దర్శించుకోవడానికి అన్ని ఏర్పట్లు చేశామని తెలిపారు.

అంతేకాకుండా ఈ తొమ్మది రోజుల వేడుకల్లో సైకిల్ రేస్, మారథాన్ రేస్, ఖో-ఖో, కబడ్డీ, వాలీబాల్, మల్కాంబ్, దంగల్ రోయింగ్‌ పోటీలను కూడా నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్‌ సభ్యులు తెలిపారు. కాబట్టి ఈ పోటీల్లో భారీగా భక్తలు పాల్గొనేందుకు అన్ని ఏర్పట్లు చేశారని పేర్కొన్నారు. ఈ పోటీల్లో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ట్రస్ట్‌ సభ్యులు కోరారు.