Sri Kalahasthi: శ్రీ కాళహస్తి మాహాత్మ్యం చాటిన బ్రెజిల్ దేశస్తులు

Kaburulu

Kaburulu Desk

December 7, 2022 | 10:14 PM

Sri Kalahasthi: శ్రీ కాళహస్తి మాహాత్మ్యం చాటిన బ్రెజిల్ దేశస్తులు

త్రిలింగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీకాళహస్తి క్షేత్రంలో 22 మంది బ్రెజిల్ దేశస్తులు రాహుకేతు పూజలు నిర్వహించారు. విదేశీయులు సైతం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది అయితే ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వ్యాసం చదివేయండి.

హిందూ సంప్రదాయ వస్త్రధారణలో శ్రీకాళహస్తి క్షేత్రాన్ని బ్రెజిల్ దేశస్థులు మృత్యుంజయ అభిషేకం తోపాటు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించి, భక్తితో దర్శించుకున్నారు. ఇతర దేశాల్లో ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యత చాలా ఉందని కొనియాడారు. హిందూ ధర్మ సంస్కృతి సాంప్రదాయాలను ఈ దేశస్తులు కొందరు తప్పుదోవ పట్టించినా, వాటిని మూఢనమ్మకాలని ముద్రవేసినా విదేశాలు మాత్రం వాటికి శాస్త్రీయ పరమైన ఆధారాలతో రుజువులు చేస్తూ, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్నాయని చెబుతూ కాళహస్తిలో ఆథిత్యం లభించినందుకు ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు ఎలా వచ్చిందంటే, శ్రీకాళహస్తి అనే పదంలో శ్రీ అంటే సాలెపురుగు అనీ, కాళ అంటే పాము అనీ, హస్తి అంటే ఏనుగు అని అర్థం. ఈ మూడు కలిసి అక్కడి శివుడిని పూజించి అభిషేక కార్యక్రమాలు చేసినందున ఆ క్షేత్రానికి శ్రీ కాళహస్తి అనే పేరు వచ్చింది.

ఈ క్షేత్రానికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే గ్రహాలు ఏర్పడినప్పుడు దేశంలోని అన్ని దేవాలయాలు మూతపడ్డా ఈ దేవాలయ తలుపులు మాత్రం మూసుకోవు. కారణం, రాహు కేతువుల ప్రభావం ఈ క్షేత్రంపై ఉండదట అందుకనే కావచ్చు బ్రెజిల్ నుండి మరీ వచ్చి రాహు కేతు పూజలు నిర్వహిస్తున్నారు దీని గురించి మన దేశంలో ఉన్నటువంటి భక్తులకు కూడా తెలియాల్సిన అవసరం చాలా ఉంది.