President Draupadi Murmu:శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

Kaburulu

Kaburulu Desk

December 14, 2022 | 06:45 PM

President Draupadi Murmu:శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్యే మూడు రోజుల పాటు పర్యటన నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి క్షేత్రాలు దర్శించుకొన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ రాష్ట్రపతికి సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న రాష్ట్రపతి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రాన్ని ఈ నెల 26న దర్శించుకోనున్నారు.

నంద్యాల జిల్లాలో గల శ్రీశైల క్షేత్రంలో కొలువుదీరిన మల్లికార్జున స్వామిని భారత రాష్ట్రపతి ఈనెల 26వ తేదీన దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 12:15 గంటల ప్రాంతంలో శ్రీశైలం చేరుకుని శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోనున్నారు. తదనంతరం కేంద్ర పర్యాటక శాఖ ద్వారా శ్రీశైల దేవస్థానం వారు చేపట్టిన ప్రసాదం పథకం పనులను ప్రారంభించనున్నారు.

ఈ ప్రసాద స్కీమ్ ను కేంద్ర పర్యాటక శాఖ 2015లో ప్రారంభించింది. ఈ పథకం ద్వారా పూర్తిస్థాయిలో అభివృద్ధి పరిచేదిశగా కేంద్రం ఆలోచిస్తుంది. అదేవిధంగా ఈ పథకం ద్వారా పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రపతి ముర్ము పర్యటనను దృష్టిలో ఉంచుకొని శ్రీశైల క్షేత్రం, చుట్టూ పరిసరాల్లో భారీ బందోబస్తు నిర్వహించనున్నారు.