Prasadam eating God himself:ప్రసాదాన్ని స్వయంగా భగవంతుడే ఆరగించే దేవాలయమేదో తెలుసా…?

Kaburulu

Kaburulu Desk

December 16, 2022 | 10:32 PM

Prasadam eating God himself:ప్రసాదాన్ని స్వయంగా భగవంతుడే ఆరగించే దేవాలయమేదో తెలుసా…?

సాధారణంగా ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు భగవంతునికి నైవేద్యం సమర్పించి మిగిలిన ప్రసాదాన్ని భక్తులకు పంచుతారు. కానీ సమర్పించిన నైవేద్యం సాక్షాత్తు భగవంతుడు భుజించడం ఎక్కడా చూసుండరు… అటువంటి ఆలయం కూడా ఒకటుంది.. ఎక్కడో తెలుసా…

కేరళలోని తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం. ఇక్కడి ఆలయంలో కొలువైన శ్రీ కృష్ణుడు భక్తులు పెట్టే నైవేద్యం స్వయంగా తింటాడు. ఇక్కడి ఇంకో ప్రత్యేకత ఏంటంటే అర్ధరాత్రి ఏకాంతసేవ తర్వాత దీపారాధన చేసే ఏకైక దేవాలయం ఇది. ఈ ఆలయంలో ఉన్న శ్రీ కృష్ణడు ఎంతో ఆకలిగా ఉంటాడని, అందుకోసమే ఈ ఆలయంలో స్వామి వారికి ప్రతిరోజు ఏడు సార్లు నైవేద్యాన్ని సమర్పిస్తారని ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు.

భగవంతుని ముందు నైవేద్యం సమర్పించిన ప్రతిసారీ కొంత పరిమాణం తగ్గుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇక్కడి దేవాలయం. ఈ విధంగా ప్రసాదం తగ్గిపోవడంతో స్వామివారే నైవేద్యం తింటారని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయంలో ముందుగా స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాతనే అభిషేకం నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్వామివారికి నైవేద్యం సమర్పించాకనే ఆలయ ద్వారాన్ని తెరుస్తారు. గ్రహణం ఉన్న సమయంలో ఈ ఆలయం మూత పడకుంటా నిత్య పూజలతో ఇక్కడి స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. నైవేద్యం సమర్పించడం ఆలస్యమైతే స్వామివారి నడుముకు ఉన్న ఆభరణం వదులుగా మారి కిందకి జారుతుందట….!