KCR Rajasuya yagam:నేడు ఢిల్లీలో కేసీఆర్ రాజసూయ యాగం

Kaburulu

Kaburulu Desk

December 14, 2022 | 07:54 AM

KCR Rajasuya yagam:నేడు ఢిల్లీలో కేసీఆర్ రాజసూయ యాగం

పూర్వం రాజులు ఏ పని మొదలుపెట్టినా ఎటువంటి ఆటంకాలు రాకూడదని రాజసూయ యాగం చేపట్టేవారు. ఈ యాగం తమ వద్దే ఉంటున్న పక్క రాజుల వేగులు వెన్నుపోటు పొడవకుండా ఉండదుకు ఉండేందుకు తోడ్పడేది. ఇంకా యుద్ధ సమయంలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు ఉపయోగపడేది. అలనాటి రాజుల తరహాలో నేటి తెలంగాణ ముఖ్యమంత్రి కూడా రాజసూయ యాగం చేయడం విశేషం.
తెలంగాణ రాష్ట్ర సమితి అనేది భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీగా మారిన విషయం విధితమే. ఇలా జాతీయ స్థాయిలో అడుగుపెడుతున్న భారాసా అధ్యక్షుడు కేసీఆర్ ఆ పార్టీకి ఎటువంటి ఆటంకాలు రాకూడదని దేశ రాజధాని నగరంలో పార్టీ భవనం శంకుస్థాపనకు ముందు రాజసూయ యాగం చేయడానికి పూనుకున్నారు. నిన్న రాత్రి సీఎం కేసీఆర్ తో పాటు కుటుంబ సభ్యులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లి నవ చండీ హోమం జరిపారు. తర్వాత పార్టీ ఆఫీస్ ప్రారంభించి, నేతల సమక్షంలో టిఆర్ఎస్ జండా ఎగురవేశారు.

నేడు జరగబోయే రాజసూయ యాగంలో భాగంగా ముందు వినాయక స్వామి పూజ తర్వాత పుణ్యాహవాచనం పారాయణాలు చదివి, తెల్లవారుజామున నవ చండీ హోమం చేసి శృంగేరి పీఠానికి చెందిన వ్యాసోజుల గోపికృష్ణ నవశశాంక శర్మతో పాటు 11 మంది రుత్వికులు తో హోమం జరిపిస్తారు. దీని కోసం ఆఫీసు వెనక మూడు యజ్ఞ గుండాలని ఏర్పాటు చేసి యాగం జరిపిస్తారు. ఇప్పటివరకు చేసిన ఇలాంటి యాగాల తర్వాత కేసీఆర్ చేపట్టిన ప్రతి పని విజయవంతం అయిందని అందువల్ల ఇది కూడా విజయవంతం అవుతుందని పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి.