Kamandala Ganesha:కమండల గణపతి గురించి విన్నారా…?

Kaburulu

Kaburulu Desk

December 17, 2022 | 10:45 PM

Kamandala Ganesha:కమండల గణపతి గురించి విన్నారా…?

విజ్ఞాలను తొలగించే విఘ్నేశ్వరుడు, గణాలకు అధిపతి గణపతి, ఏనుగు ముఖం గల వాడు గజాననుడు, నాయకులలో విశిష్టమైన వాడు వినాయకుడు… ఇలా మనం ఎన్నో పేర్లతో పిలిచే పార్వతీ పుత్రుడిని ముందుగా పూజించాకనే ఏ శుభకార్యమైనా మొదలు పెడతాం.. మరి వినాయకుడిని కమండల గణపతి అని ఎక్కడ పిలుస్తారో? ఎందుకు పిలుస్తారో ఇపుడు తెలుసుకుందాం…!

అసలు వినాయకుడికి కమండల గణపతి అని పేరు రావడానికి గల కారణం ఏమిటి అంటే… ఇక్కడి స్థల పురాణం ప్రకారం శని వక్ర దృష్టి కారణంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న పార్వతీదేవి ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేయాలని భావించి వినాయకుడిని ప్రార్థించిందని ఆ సమయంలోనే వినాయకుడు బ్రహ్మచారి రూపంలో కమండలం ధరించి, ఒక బ్రహ్మ తీర్థం సృష్టించాడు. ఈ విధంగా వినాయకుడు కమండలం ధరించి ఉండటంవల్ల ఈ ఆలయానికి కమండల గణపతి అనే పేరు వచ్చింది.

ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే.. కర్ణాటకలోని చిక్క మంగళూరు జిల్లా కొప్ప పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి దట్టమైన అటవీ ప్రదేశంలో ఉంది. ఈ ఆలయంలోని వినాయకుడు యోగ ముద్రలో ఉంటాడు. వర్షాకాల సమయంలో పుష్కరిణిలో ఉండే నీరు స్వామివారి పాదాలకు తాకుతుంది. ఈ సమయంలో స్వామివారిని దర్శించి ఆ నీటిని మహా తీర్థ ప్రసాదంగా భక్తులు స్వీకరిస్తారు.