History of Santa Claus:శాంటాక్లాజ్ చరిత్ర తెలుసా మీకు…?

Kaburulu

Kaburulu Desk

December 25, 2022 | 06:45 PM

History of Santa Claus:శాంటాక్లాజ్ చరిత్ర తెలుసా మీకు…?

ప్రతీ క్రిస్మస్ పండుగకు శాంటా క్లాజ్ అందరికి ఆశ్చర్యాన్ని కలుగజేసే విధంగా ప్రత్యక్షమై కొత్త కొత్త బహుమతులను అందజేస్తుంటాడు. చిన్నపిల్లలను అలరింపజేసేవిధంగా, వారితో ఆటలు ఆడుతూ.. పాటలు పాడుతూ గడిపే క్రిస్మస్ తాతయ్య గురించి మీలో ఎంత మందికి తెలుసు…? తెలియకుంటే ఆ క్రిస్మస్ తాతయ్యగా పిలువబడే శాంటా క్లాజ్ ఎవరో, ఎక్కడినుండి వచ్చి బహుమతులు అందిస్తుంటాడో అన్న విషయాలను, దాని వెనక ఉన్న చారిత్రాత్మక కథనాన్ని ఇపుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

నాల్గవ శతాబ్దంలో సెయింట్ నికోలస్ అనే వ్యక్తి ప్రస్తుత టర్కీ అయిన మైరాలో నివసించేవాడు. అతను చాలా ధనవంతుడు. ఇలా సంతోషంగా ఉన్న నికోలస్ తన తల్లిదండ్రులను కోల్పోయాడు. దీని తరువాత, నికోలస్, ఒక అనాథగా ఎల్లప్పుడూ రహస్యంగా పేదలకు సహాయం చేస్తూ ఉండేవాడు. రహస్య బహుమతులు ఇచ్చి సంతోషపెట్టాలని ప్రయత్నించి దుఃఖాన్ని మరచిపోయేవాడు. ఒకసారి బంగారు సాక్స్లు నిరుపేద ఆడపిల్లల ఇంటిపై నికోలస్ వేసి రహస్యాంగా దాక్కున్నాడు. చివరకు నికోలస్ ను ఆ వ్యక్తి చూడటంతో, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని నికోలస్ అన్నాడు. కానీ త్వరలోనే ఈ  విషయం అందరికీ పూర్తిగా అర్థమై ఆ రోజు  నుంచి ఎవరికైనా సీక్రెట్ గిఫ్ట్ వస్తే అది నికోలస్ ఇచ్చిన గిఫ్ట్ అని అందరూ తెలుసుకున్నారు. నికోలస్ క్రమంగా  శాంటా తాతాగా ప్రజాదరణ పొందాడు.

యూకేలో క్రిస్మస్ రోజున పిల్లలకు బహుమతులు ఇవ్వడం ఒక ఆనవాయితీ. అందుకే నికోలస్ కథ మొదట UKలో ప్రాచుర్యం పొందింది. అతనికి ఫాదర్ క్రిస్మస్, ఓల్డ్ మ్యాన్ క్రిస్మస్ అని పేరు పెట్టారు. అప్పటినుండి, నికోలస్ శాంటా క్లాజ్ గా పిలువబడుతున్నారు…. చాలా ఆసక్తిగా ఉంది కదూ…. శాంటా తాత చరిత్ర… క్రిస్మస్ పర్వదినాన ఈ విషయం చదివినందుకు కొత్త విషయం తెలుసుకున్నారు కదా…!