Hanuman Jayanthi: హనుమాన్ జయంతి ఎప్పుడో తెలుసా..? ఆరోజు జపించే మంత్రం ఇదే…!

Kaburulu

Kaburulu Desk

April 3, 2023 | 09:53 PM

Hanuman Jayanthi: హనుమాన్ జయంతి ఎప్పుడో తెలుసా..? ఆరోజు జపించే మంత్రం ఇదే…!

చైత్ర మాసం పౌర్ణమిని హనుమాన్ జయంతిగా హిందూ బంధువులు భావిస్తూ అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. తిథి రోజున హనుమంతుడి పూజ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శక్తికి మూలంగా భావించే హనుమంతుడిని ఆరాధిస్తే అన్ని కష్టాల నుండి రక్షణ లభిస్తుందని విశ్వాసం. మానవ జీవితంలో ఎటువంటి కష్టాలు ఎదురైనా భక్తి , విశ్వాసంతో వాయు నందనుడు హనుమంతుడిని పూజిస్తే .. ఆ భక్తుడిని రక్షిస్తాడని నమ్మకం.

హనుమంతుడి జయంతిని భక్తులు పవిత్రంగా జరుపుకుంటారు. హనుమాన్ ఆరాధనతో ముడిపడి ఉన్న ఈ పండుగలో.. ఆంజనేయ మంత్రాలను పఠించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. శ్రీ రామ భక్త హనుమాన్ నుంచి కోరుకున్న వరాన్ని పొందగల అద్భుత మంత్రం గురించి వివరంగా తెలుసుకుందాం..

హనుమాన్ జయంతి రోజున తమ కష్టాలు తీర్చమని సరళ మంత్రమైన ‘ఓం శ్రీ హనుమతే నమః’ లేదా ‘ఓం హనుమతే నమః’ అనే మంత్రాన్ని పూర్తి భక్తి, విశ్వాసంతో జపించండి. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా.. భజరంగ బలి తన భక్తుల కష్టాలన్నింటినీ తొలగిస్తాడని.. ఎటువంటి కోరికలైనా రెప్పపాటులో నెరవేరతాయని నమ్మకం. ఈ మంత్రానికి చాలా శక్తి ఉందని నమ్ముతారు. ఎటువంటి పెద్ద సమస్యలైనా సులభంగా పరిష్కరించబడతాయి. సాధకుడికి ఆనందం, శ్రేయస్సు, అదృష్టం లభిస్తాయి.