Drone cameras in Tirumala: సోషల్ మీడియాలో శ్రీవారి ఆలయ వీడియోలు కలకలం

Kaburulu

Kaburulu Desk

January 21, 2023 | 12:56 PM

Drone cameras in Tirumala: సోషల్ మీడియాలో శ్రీవారి ఆలయ వీడియోలు కలకలం

ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్స్ సోషల్ మీడియాలో అప్లోడ్ అయినట్లు తెలుస్తుంది. డ్రోన్ కెమెరాలో తీసిన శ్రీవారి ఆలయ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఐకాన్ అనే ఇన్స్టాగ్రమ్ అకౌంట్ నుండి ఈ వీడియోలు అప్లోడ్ అయినట్లు గుర్తించారు. దీనితో అలిపిరి నుండి శ్రీవారి ఆలయం వరకు, తిరుమలలోని మిగతా అన్నీ పరిసరాలన్నీ కూడా హై సెక్యూరిటీ జోన్ లో ఉంటాయి. ఎక్కడికక్కడ సిసి కెమెరాల నిఘా ఉంటుంది.

శ్రీవారి ఆలయంపై డ్రోన్ కెమెరాలు ఎగిరినా విజిలెన్స్ యంత్రాంగం గుర్తించలేకపోయింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ కు చెందిన వ్యక్తులే ఈ డ్రోన్ వీడియోలు తీసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. సోషల్ మీడియాలో వీడియోను అప్లోడ్ చేసినవారిని తప్పకుండా గుర్తించి కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకుంటామని టీటీడీ సివిఎస్వో నరసింహ కిషోర్ స్పష్టం చేశారు. ఈ విడియోలను డ్రోన్ తో తీశారా లేక శాటిలైట్ సహాయంతో తీశారా అన్నది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది.

ఎట్టకేలకు విడియోలను రికార్డ్ చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు వెల్లడించారు. వాస్తవంగా అయితే తిరుమల గగనతలంలో విమానాలు, హెలికాప్టర్లు వంటివి ఎగరడానికి కూడా అనుమతి లేదు. అటువంటిది డ్రోన్లు ఎగిరి వీడియోలు తీయడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. దీనిపై అధికారుల నుండి స్పష్టమైన సమాచారం రావాల్సి ఉంది.