Difficult to visit this Temples:భక్తితో పాటు శక్తి ఉంటేనే దర్శనిమిచ్చే ఆలయాలేంటో తెలుసా…?

Kaburulu

Kaburulu Desk

December 10, 2022 | 03:40 PM

Difficult to visit this Temples:భక్తితో పాటు శక్తి ఉంటేనే దర్శనిమిచ్చే ఆలయాలేంటో తెలుసా…?

సాధారణంగా భక్తులందరూ వారికున్న పవిత్రమైన భక్తితో భగవంతుడిని దర్శించుకుంటారు. కానీ దైవభూమిగా ప్రసిద్ధి చెందిన ఉత్తరఖండ్ రాష్ట్రంలో కొన్ని దేవాలయాల దర్శనం చేసుకోవాలంటే అనేక ప్రకృతి సిద్ధమైన ఆటంకాలను శాయశక్తులా అధిగమించి దర్శించుకోవాల్సి ఉంటుంది. ఆ ఆలయాలు ఏవో, ఎలా దర్శించుకోవాలో వెంటనే తెలుసుకోండి మరి…

చైనా ఆక్రమిత టిబెట్‌లో కొలువై ఉన్న కైలాస మానస సరోవర్, ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లాలో కొలువైన కార్తీక స్వామి ఆలయం, ఉత్తరాఖండ్‌ చోటా చార్‌ధామ్ యాత్రగా ప్రసిద్ధి చెందిన నాలుగు ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన యుమునోత్రి దేవాలయం, ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న మరో పర్వత క్షేత్రం తుంగనాథ్ ఆలయం, 3 వేల 888 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్ మంచు శివలింగం, పరస్నాథ్ కొండపై కొలువైన శిఖర్ జీ ఆలయం, లద్దాఖ్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మఠాల్లో ఒకటైన ఫుగ్తాల్ మఠం వంటి వాటిని దర్శించుకోవాలంటే మంచు తుఫానులు, చలి వంటి వాటిని అధిగమించి అత్యంత సాహసం చేసి భగవంతుని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.

మరి మీరూ ఈ దేవాలయాల సందర్శనార్థం వెళ్లాలనుకుంటే శారీరకంగా కూడా సిద్ధమై, అన్ని ఆటంకాలను అధిగమించేలా ప్రణాళికలు వేసుకొని, మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా కూడా సిద్ధమై వెళ్ళండి.