Shrine V/S Temple: మందిరానికి, దేవాలయానికి మధ్య తేడా ఏంటో తెలుసా…?

Kaburulu

Kaburulu Desk

December 6, 2022 | 09:38 PM

Shrine V/S Temple: మందిరానికి, దేవాలయానికి మధ్య తేడా ఏంటో తెలుసా…?

సాధారణంగా మనం మందిరాన్ని, దేవాలయాన్ని ఒకే అర్థంలో వాడుతూ ఉంటాము. కానీ ఆ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉందనీ, ఆ రెండు పదాలు వేరు వేరు అర్థాలిస్తాయని మీకు తెలుసా? అయితే ఇంకెందుకు ఆలస్యం చదివేయండి ఈ వ్యాసం.

కృష్ణ మందిరము, రామమందిరము ఇలా మందిరాలు ఎన్నో… అలాగే శ్రీ కృష్ణ దేవాలయము, వెంకటేశ్వర దేవాలయం ఇలా దేవాలయాలు కూడా ఎన్నో మనం చూస్తుంటాం. కానీ మందిరాలలో దర్శనమిచ్చే భగవంతుడు ప్రతిమ రూపంలో ఉంటే దేవాలయంలో దర్శనమిచ్చే భగవంతుడు విగ్రహ రూపంలో ఉంటాడు. ప్రతిమలో – ‘ప్రతి’ అంటే అసలైన రూపం యొక్క మరొక రూపం అనే అర్థంలో వాడుతాం. అంటే ఇక్కడ భగవంతుడి యొక్క ప్రతిమ అని మాత్రమే అర్థం. కానీ దేవాలయంలో ఉండేది విగ్రహం కాబట్టి విగ్రహం అంటే విశిష్టమైన అంశాలను గ్రహించి ఇచ్చేది అని అర్థం. దేవాలయాల్లో గోడలపై, గోపురాలపై ఉండే శిల్పాలను ప్రతిమలని పిలువవచ్చు. ప్రతిమగా ఉన్న ఒక శిల్పాన్ని గర్భగుడిలో ఆగమ శాస్త్రాల ప్రకారం ప్రతిష్టాపన చేస్తే ప్రతిమ కాస్త విగ్రహంగా మారుతుంది.

ఇంకా చెప్పాలంటే.. గాలి గోపురం, ప్రాకారం, బలిపీఠం, ధ్వజస్థంభం, ప్రధాన మంటపం, గర్భగుడి ప్రాకారం, గర్భగుడి, మూలవిరాట్టు, విమాన గోపురం వంటి వాటినన్నింటినీ ఆగమశాస్త్రాల ప్రకారం నిర్మిస్తే అది దేవాలయం అవుతుంది. ఇవేవీ లేకుండా సాధారణంగా ఒక గర్భగుడి మాత్రమే ఉండి మూలవిరాట్టు మాత్రమే ఉండే వాటిని మందిరాలు అని పిలుస్తాం.