Davanagire Deepothsavam: కష్టాలొస్తే ద్వీపాలు వెలిగించే నగరమేదో తెలుసా…?

Kaburulu

Kaburulu Desk

December 23, 2022 | 10:21 PM

Davanagire Deepothsavam: కష్టాలొస్తే ద్వీపాలు వెలిగించే నగరమేదో తెలుసా…?

ప్రజలకు ఏవైనా ఇబ్బందులు లేదా గొడవలు ఏర్పడితే ముందు వెళ్ళేది పోలీస్ స్టేషన్ లేదా కోర్టుకు కానీ కర్ణాటక రాష్ట్రంలోని దావణగిరే నగరంలోని ప్రజలు దుర్గాంబికా దేవి ఆలయానికి వెళ్ళి అక్కడి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి, ద్వీపాలను వెలిగిస్తారు. తత్ఫలితంగా వారి కష్టాలు, బాధలు తీరిపోతాయని ప్రజల నమ్మకం. మరి ఇంకా ఈ నగర విశేషాలేమిటో ఈ వ్యాసంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఈ పట్టణంలోని ఎక్కువ మంది ప్రజలు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కరు, కోర్టు గడప తొక్కరు. మనుషుల మధ్య గొడవలు వచ్చినా, వ్యాపారంలో గొడవలు వచ్చినా గుడి గంట మోగిస్తారు భవిష్యత్తులో తమకు ఏదైనా జరగాలని కోరుకుంటే.. తమ కోరికను తెలుపుతూ.. దీపం వెలిగించడం ఇక్కడి సంప్రదాయం. ఈ దీపోత్సవ వేడుకలను కళ్లారా చూడటం ఒక విధంగా ప్రత్యేకమే. ఇది శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారం.

ఒక నెలలో ప్రజలు చేసిన పూజా ఫలితం వస్తుంది. ఎవరైనా తప్పు చేస్తే.. దేవత శిక్ష విధిస్తుందని ప్రజలు నమ్ముతారు. అయితే దీపం వెలిగించడం అనేది అమ్మవారికి దీపం సమర్పించే సంప్రదాయంలో భాగంగా కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్న సాంప్రదాయం. ఇంకా ఇక్కడి మరొక ప్రత్యేకత ఏమిటంటే సంక్రాంతి ముందురోజైన భోగి పండుగ నాడు దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు. ఈ దీపోత్సవం సందర్భంగా ప్రతి ఇల్లు ద్వీపకాంతులతో శోభాయమానంగా కనబడుతుంది. ఇది దీపావళి పండుగను తలపిస్తుంది.