Chinese Khali Temple:నూడిల్స్ ను నైవేద్యంగా సమర్పించే ఆలయమేదో తెలుసా…?

Kaburulu

Kaburulu Desk

December 10, 2022 | 03:35 PM

Chinese Khali Temple:నూడిల్స్ ను నైవేద్యంగా సమర్పించే ఆలయమేదో తెలుసా…?

భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు పుట్టినిల్లు. అందుకే మనదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వంగల దేశమని అంటారు. మన దేశంలో ఉన్నటువంటి వివిధ పూజావిధానాలు చాలా భిన్నమైనవి. అటువంటి వాటిలో నూడిల్స్ ను నైవేద్యంగా సమర్పించే పూజా విధానం కూడా ఒకటి… అవును మీరు చదివింది అక్షరాల నిజం నూడిల్స్ ను కూడా నైవేద్యంగా సమర్పించే ఆలయం ఉంది, అదే చైనీస్ ఖాళీ మాత ఆలయం. అదెక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే ఆలస్యం చేయకుండా చదివేయండి…

కోల్‌కతాలోని చైనా టౌన్‌ లో తంగ్రా అనే ఫేమస్ ఏరియాలో చైనీస్ కాళీ మాత ఆలయం ఉంది. ఈ ఆలయం, చుట్టూ ఉన్న పరిసరాలు భారత్ ను మైమరిపిస్తాయి. చైనా, హాంకాంగ్, జపాన్, తైవాన్, టిబెట్ లాంటి దేశాలను తలపిస్తాయి. ఎందుకంటే అక్కడి ఆచార వ్యవహారాలన్నీ తూర్పు ఆసియా దేశాల వారు పాటించేవిలా ఉంటాయి.

సాధారణంగా ఏ దేవాలయానికి వెళ్లినా నైవేద్యంగా పరమాన్నం వంటి వాటిని సమర్పిస్తుంటారు. అలాగే భక్తులకు కూడా ప్రసాదంగా భగవంతుడికి సమర్పించిన పరమన్నాన్ని లేదా లడ్డును అందిస్తుంటారు. కానీ ఈ ఆలయంలోని చైనీస్ ఖాళీ మాతకు చైనీస్ ఫుడ్ అయిన నూడిల్స్ ను నైవేద్యంగా సమర్పిస్తారు. చదవడానికి వింతగా ఉన్నా అదే నిజం. అందుకే కోల్‌కతాకు వెళ్లే పర్యాటకులు తప్పనిసరిగా అక్కడకు వెళ్తుంటారు.