Chaganti as a facilitator in TTD: టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు

టీటీడీ నిర్వహిస్తున్న ‘పారాయణం’ కార్యక్రమాలు ప్రతి వ్యక్తిని చేరాలంటే సరైన సలహాలు అవసరం కాబట్టి చాగంటి కోటేశ్వరరావును నియమించడం ద్వారా అనుకున్న ఫలితం పొందుతామని. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును నియమిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు.
తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం జరిగిన హిందూ ధర్మ ప్రచార పరిషత్ (హెచ్‌డిపిపి), శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్‌విబిసి) ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సమావేశం ముగిసిన అనంతరం ఈ ప్రకటన చేశారు. వైవీ సుబ్బారెడ్డి మానవాళి శ్రేయస్సు కోసం వివిధ ప్రదేశాలలో ‘యాగాలు’ , ‘హోమాలు’ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
భక్తి కార్యక్రమాలు నిర్వహించేందుకు గ్రామస్తులకు భజన, కోలాటం సామాగ్రిని అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా కొండపైన టీటీడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై తిరుమలకు తరలివస్తున్న భక్తుల అనుభవాలను ప్రసారం చేయాలని ఎస్వీబీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించిందని ఛైర్మన్ పేర్కొన్నారు. ఎస్వీబీసీ తెలుగు, తమిళ చానళ్ల తరహాలో కన్నడ, హిందీ చానళ్లు ప్రాచుర్యం పొందేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయాలని కూడా నిర్ణయించినట్లు తెలిపారు.