Arasavelli Sun Temple:సంవత్సరానికి రెండుసార్లు సూర్య కిరణాలు మూలవిరాట్టుపై పడే దేవాలయమేదో తెలుసా…?

Kaburulu

Kaburulu Desk

December 17, 2022 | 10:55 PM

Arasavelli Sun Temple:సంవత్సరానికి రెండుసార్లు సూర్య కిరణాలు మూలవిరాట్టుపై పడే దేవాలయమేదో తెలుసా…?

ఆ దేవాలయంలో సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్య కిరణాలు ఉదయం, సాయంత్రం గర్బ గుడిలో ఉన్న మూలవిరాట్టు పాదాలకు తాకుతాయి. సకల జీవులకూ సంక్షేమాన్ని, ఆయురారోగ్యాలనూ, ప్రసాదించే ఇక్కడి మూర్తి అభయ ముద్రలో ఉంటాడు. ఆ ఆలయమేదో మీకు తెలుసా…? అయితే ఇంకెందుకు ఆలస్యం తెలుసుకోండి.

సంవత్సరానికి రెండు సార్లు సూర్యకిరణాలు మూలవిరాట్టు విగ్రహ పాదాలకు సోకేలా నిర్మించిన ఆలయం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఉషా పద్మినీ ఛాయా సమేత శ్రీ నారాయణ స్వామి దేవాలయం. అరసవల్లి దేవస్థానం ప్రాంగణం అనివెట్టి మండపం, ధ్వజస్తంభం నుంచి సుదర్శన ద్వారం మధ్యలో తొలి కిరణాలు గర్భగుడిలోని మాలవిరాట్టు ఆదిత్యుని శిరస్సును తాకుతాయి. ఆదిత్యుని సూర్యకిరణాలు తాకిన వైనాన్ని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా అరసవల్లికి తరలివస్తారు.

సాధారణ రోజులతో పోలిస్తే మాఘ, వైశాఖ, కార్తీక మాసాల ఆదివారాల్లో ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య బాగా పెరుగుతుంది. ముఖ్యంగా రథసప్తమినాడు ఆ సంఖ్య లక్షల్లోకి చేరుకుంటుంది. అలాగే ఉత్తరాయణ, దక్షిణాయన మార్పుల్లో భాగంగా ప్రతిఏటా మార్చి 9, 10, 11, 12 తారీఖుల్లోనూ, అక్టోబరు 1, 2, 3, 4 తేదీల్లోనూ, స్వామివారి, మూలవిరాట్టు పై సూర్య తొలికిరణాలు తాకుతాయి. స్వామి పాదాల మీదుగా మొదలై శిరోభాగం వరకూ సూర్యకిరణాలు ప్రసరించే అద్భుత, అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం… అటు వెళ్లినపుడు తప్పకుండా ఈ అద్భుతాన్ని చూడండి మరి….!