Ainavilli Sri Vigneswara Swamy: లక్ష పెన్నులతో వినాయకుడికి అభిషేకం.. అనంతరం విద్యార్థులకు పంపిణీ

Kaburulu

Kaburulu Desk

January 31, 2023 | 09:01 PM

Ainavilli Sri Vigneswara Swamy: లక్ష పెన్నులతో వినాయకుడికి అభిషేకం.. అనంతరం విద్యార్థులకు పంపిణీ

ఆంద్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయినవిల్లిలో వెలసిన  శ్రీ విఘ్నేశ్వరస్వామి స్వయంభూ దేవాలయం ఉంది. ఈ క్షేత్రంలో వసంత పంచమిలో భాగంగా లక్ష పెన్నులు పంపిణీ చేశారు. స్వామి వారికీ గణపతి పూజ, సరస్వతి కల్పం, సరస్వతి మండపా ఆరాధన, సప్తనదీ జలాబిషేకం, గరికపూజ, ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. స్వామి వారికి పెన్నులతోనే అభిషేకం నిర్వహించారు.

పెన్నులు తీసుకునేందుకు విద్యార్థులు, భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి క్యూ కట్టారు విద్యార్థులు. స్వామి వారి పాదాల చెంత ఉంచిన కలం విద్యాభివృద్ధికి తోడ్పడుతుందనేది భక్తుల విశ్వాసం. మూడు వారాలు పాటు పెన్నుల పంపిణీ జరుగుతుందని ఆలయ ఈఓ ప్రకటించారు. ఎంత మంది వచ్చిన పెన్నులు పంపిణి చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

విఘ్నేశ్వర స్వామి వారి పాదాల చెంత లక్ష కలములు ఉంచి వార్షిక పరీక్షలు రాసే విద్యార్థులకు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. విద్యార్థులకు విఘ్నేశ్వర స్వామి కలం ఎంతగానో ఉపయోగపడుతుందన్న ధృడమైన సంకల్పంతో పంపిణీ చేస్తున్నామన్నారు. స్వామి వారి పాదాలా దగ్గర ఉంచిన పెన్నులు తీసుకునేందుకు విద్యార్థులు పోటీపడ్డారు.