నిశ్చితార్థం చేసుకున్న బుల్లితెర కమెడియన్

బుల్లితెరపై పటాస్ షోలో ఆడియన్ గా వచ్చి తన మాటలతో అందర్నీ నవ్వించి కమెడియన్ గా మారాడు యాదమ్మ రాజు.

తన జోక్స్, కామెడీ, స్టాండప్ కామెడీ, స్కిట్స్.. ఇలా రకరకాలుగా జనాల్ని నవ్వించి పాపులర్ అయిపోయాడు యాదమ్మ రాజు.

ప్రస్తుతం రాజు పలు టీవీ షోలు, సినిమాలతో బిజీగానే ఉన్నాడు.

కొన్నేళ్ల క్రితం ఒక టీవీ షోలో తన ప్రేయసి స్టెల్లాని పరిచయం చేశాడు.

ఇటీవల రెండు కుటుంబాలు ఒప్పుకోవడంతో వీరి నిశ్చితార్థం జరిగింది.

పలువురు టీవీ ప్రముఖులు వీరి నిశ్చితార్థానికి విచ్చేసి ఆశీర్వదించారు. త్వరలోనే వీరు పెళ్లిచేసుకోనున్నారు.