విజయ్ దేవరకొండ గత ఐదేళ్లుగా ‘దేవరశాంటా’ పేరుతో అభిమానులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు ఇస్తున్నాడు.

ఈ ఏడాది బహుమతులు కాకుండా 100 మంది ఫ్యాన్స్‌ని వెకేషన్‌కి తీసుకు వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నాడు.

ఈ క్రమంలోనే ఇటీవల ఫ్యాన్స్‌కి నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు. *మౌంటెయిన్స్ ఆఫ్ ఇండియా *బీచెస్ ఆఫ్ ఇండియా *కల్చర్ ట్రిప్ ఆఫ్ ఇండియా *డిసెర్ట్స్ ఇన్ ఇండియా

ఇచ్చిన నాలుగు ఆప్షన్స్‌లో ఎక్కువ మంది 'మౌంటెయిన్స్ ఆఫ్ ఇండియా'కి ఓటు వేశారు.

దీంతో విజయ్ 100 మంది ఫ్యాన్స్‌ని ‘కులుమనాలి’ పంపించడానికి నిర్ణయం తీసుకున్నాడు.

ఈ విషయాన్ని తెలియజేస్తూ విజయ్.. '18 ఏళ్ళు దాటిన వారు దేవరశాంటా వెబ్‌సైట్‌కి వెళ్లి గూగుల్ డాక్యుమెంట్ ఫార్మ్‌ని ఫిల్ చేయండి. ఆ ఫార్మ్స్ చూసి మీలో 100 మందిని మేము ఎంపిక చేసి ప్రకటిస్తాము' అని తెలియజేశాడు.

ఈ వెకేషన్‌లో 100 మందికి అయ్యే ఖర్చు మొత్తం విజయ్ దేవరకొండనే భరించనున్నాడు.

మరి ఈ ఫ్రీ వెకేషన్‌కి వెళ్ళాలి అనుకుంటే.. వెంటనే దేవరశాంటా వెబ్‌సైట్‌కి వెళ్లి గూగుల్ డాక్యుమెంట్ ఫార్మ్‌ని ఫిల్ చేయండి.