చిరంజీవి వింటేజ్ లుక్‌లో కనిపిస్తూ చేస్తున్న సినిమా 'వాల్తేరు వీరయ్య'.

ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.

ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న విశాఖపట్నంలో ఘనంగా జరిగింది.

ఈ ఈవెంట్‌కి కేథ‌రిన్ థ్రెసా, ఊర్వశి రౌటెలా చీరలో వచ్చి అందర్నీ ఆకట్టుకున్నారు.

ఈ సినిమాలో కేథ‌రిన్ థ్రెసా కథని మలుపు తిప్పే ఒక కీలమైన పాత్ర పోషిస్తుంది.

ఊర్వశి రౌటెలా చిరంజీవితో కలిసి 'బాస్ పార్టీ' సాంగ్‌లో చిందేయనుంది.

ఈ మూవీలో చిరంజీవికి జోడిగా శృతిహాసన్ నటిస్తుంది.

ఆమె అనారోగ్యం కారణంగా.. నిన్న  ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రాలేకపోయింది.