రామ్ చరణ్ భార్య ఉపాసన అపోలో హాస్పిటల్ వారసురాలు అని అందరికి తెలిసిందే.

వీరిద్దరికి పెళ్లి అయిన కొత్తలో చరణ్ ఉపాసనను డబ్బు కోసం చేసుకున్నాడని కామెంట్స్ వినిపించాయి.

తాజాగా ఆ కామెంట్స్ పై ఉపాసన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది.

పెళ్ళైన కొత్తలో నేను లావుగా ఉన్నాని, అందంగా కూడా లేనని. 

చరణ్ నన్ను డబ్బుల కోసమే పెళ్లి చేసుకున్నాడని ట్రోల్ చేశారు.

అయితే అప్పుడు నాకు వాళ్ళ పై కోపం రాలేదు. ఎందుకంటే వాళ్ళకి నా గురించి ఏమి తెలియదు.

ఈ 10 ఏళ్లలో నేను ఏంటో వాళ్ళకి తెలిసింది. 

దీంతో నా పై వాళ్ళ అభిప్రాయం మారింది అంటూ చెప్పుకొచ్చింది.