టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య పేరు సౌజన్య.
ఈమె ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి మేనకోడలు అవుతుంది.
త్రివిక్రమ్, సౌజన్య ఇద్దరు ఒకే కాలేజీలో కలిసి చదువుకున్నారు.
2002లో వీరిద్దరికి పెళ్లి కాగా.. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సౌజన్య శ్రీనివాస్ మంచి క్లాసికల్ డాన్సర్. అనేక వేదికలపై ప్రదర్శనలు కూడా ఇచ్చింది.
ఈ శనివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రముఖ నృత్య గురువు పసుమర్తి రామలింగం శాస్త్రి నిర్వహణలో ‘భామ కలాపం’ నృత్యరూపకం నిర్వహించారు.
ఈ వేదికపై సౌజన్య.. తన నాట్య కళా ప్రదర్శనతో అందర్నీ ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమానికి త్రివిక్రమ్ కూడా హాజరయ్యి.. తన సతీమణి నృత్య ప్రదర్శనను తిలకించాడు.