మార్చి 24న జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌ల్లో Telugu Warriors, Bhojpuri Dabanggs విజయం సాధించి ఫైనల్స్‌కి చేరుకున్నారు.
Telugu Warriors టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు.
ఇక బ్యాటింగ్ దిగిన Bhojpuri Dabanggs.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్స్ కోల్పోయి 72 పరుగులు చేశారు.
ఆ తరువాత బరిలోకి వచ్చిన Telugu Warriors.. 4 వికెట్స్ నష్టానికి 104 పరుగులు చేసి ఫస్ట్ ఇన్నింగ్స్ ముగించారు.
ఇక రెండు ఇన్నింగ్స్‌లో Bhojpuri Dabanggs.. 6 వికెట్ల కోల్పోయి 89 పరుగులు చేసి, కేవలం 58 పరుగులు టార్గెట్ మాత్రమే ఇచ్చారు.
ఈ టార్గెట్‌ని ఈజీగా సాధించి ఈ సీజన్ టైటిల్‌ని సొంతం చేసుకున్నారు.
ఇప్పటి వరకు మొత్తం 9 సీజన్లు జరగగా.. Telugu Warriors నాలుగు టైటిల్స్ అందుకొని టాప్ లిస్ట్‌లో ఉంది.
ఆ తరువాత స్థానంలో ట్రోఫీలు అందుకున్న టీమ్స్.. Karnataka - 2, Chennai - 2, Mumbai - 1.