తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది అంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ ఏడాది న్యూ ఇయర్ టైంలో బయటకి వచ్చిన ఒక వీడియో వలన ఈ రూమర్స్ మొదలయ్యాయి.

ఇక ఈ రూమర్స్ వైరల్ అయ్యిన తరువాత కూడా వీరిద్దరూ బాలీవుడ్‌ మీడియా ముందు కలిసి సందడి చేశారు.

తాజాగా దీని పై తమన్నా రియాక్ట్ అయ్యింది.

అయితే డేటింగ్ రూమర్స్ తప్పు అని డైరెక్ట్‌గా చెప్పకుండా..

తాను విజయ్ వర్మతో కలిసి ఒక సినిమా చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది.

ఆ సినిమా వలనే అతనితో క్లోజ్‌గా ఉన్నాను అని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పింది.

అయితే స్ట్రెయిట్‌గా ప్రేమ వార్తలని కండించకుండా, సినిమా అని చెప్పడంతో నెటిజెన్లు తమన్నా మాటని నమ్మడం లేదు.