బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో 'సుశాంత్ సింగ్' ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే అతనిది ఆత్మహత్య కాదు హత్య అంటారు చాలా మంది. ఎంతమంది ఏమన్నా పోలీసులు అది సూసైడే అంటున్నారు.

దీంతో ఈ కేసుని 'సిబిఐ'కి బదిలీ చేసినా, ఇప్పటివరకు సుశాంత్ సింగ్ డెత్.. మిస్టరీగానే ఉంది.

తాజాగా ఈ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు సుశాంత్ సింగ్‌కి పోస్టుమార్టం చేసిన డాక్టర్ రూప్‌కుమార్.

పోస్టుమార్టం చేస్తున్నప్పుడు రూప్‌కుమార్ కూడా అక్కడే ఉన్నాడు. ఆ సమయంలో బాడీపై పలు గాయాలు ఉన్నాయని తెలియజేశాడు.

వీలైనంత త్వరగా బాడీని పోలీసులకు అప్పగించాలనే, పై అధికారుల ఆదేశాలు మేరకు రాత్రిపూటే పోస్టుమార్టం నిర్వహించాము. 

పోస్టుమార్టం చేస్తున్న టైంలో వీడియో తీయాలి కానీ సీనియర్లు ఆర్డర్స్‌తో ఫోటోలు మాత్రమే తీసాము.

దీంతో ఇప్పుడు రూప్‌కుమార్ చేసిన కామెంట్స్.. మరిన్ని అనుమానాలకు దారి తీస్తున్నాయి.