ధమాకా సినిమాతో శ్రీలీల స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది.
దీంతో ఈ అమ్మడు ఏకంగా మహేష్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది.
రామ్, బోయపాటి సినిమాలో కూడా హీరోయిన్‌గా చేస్తుంది.
తాజాగా బాలకృష్ణ పక్కన నటించే అవకాశం కూడా అందుకుంది.
అనిల్ రావిపూడి, బాలకృష్ణ కలయికలో వస్తున్న సినిమా NBK108.
ఈ సినిమాలో శ్రీలీల నటిస్తుంది అంటూ వార్తలు వినిపించినా ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేదు.
తాజాగా శ్రీలీల NBK108 సెట్స్‌లో జాయిన్ అవుతున్నట్లు తెలియజేస్తూ ఫోటో రిలీజ్ చేశారు.
శ్రీలీల ఒక ముఖ్య పాత్ర పోషిస్తుండగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది.