షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు ఎన్ని దేశాల్లో షూట్ చేశారో తెలుసా?

నాలుగేళ్ల తర్వాత షారుఖ్ పఠాన్ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు.

దీపికా పదుకొనే హీరోయిన్ గా, జాన్ అబ్రహం ముఖ్య పాత్రలో నటిస్తుండగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు ఈ సినిమాకి.

ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లతో ఈ సినిమా ఉండబోతుంది.

ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ ని 8 దేశాల్లో షూట్ చేసినట్టు చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది.

సినిమా యాక్షన్‌ సీక్వెన్సులని స్పెయిన్‌, యూఏఈ, టర్కీ, రష్యా, సెర్బియా, ఇటలీ, ఫ్రాన్స్‌, అఫ్గాన్‌ దేశాల్లో చిత్రీకరించినట్లు తెలిపారు.

పఠాన్ సినిమా జనవరి 25న రిలీజ్ కాబోతుంది.