మలయాళ భామ సంయుక్త టాలీవుడ్‌లో..
హ్యాట్రిక్ విజయాలతో లక్కీ చార్మ్ అనిపించుకుంటుంది.
ప్రస్తుతం ఈ భామ సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష మూవీలో నటిస్తుంది.
ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్ అండ్ హీరో పోస్టర్స్ రిలీజ్ చేశారు.
కానీ హీరోయిన్ సంయుక్తకి సంబంధించిన ఒక్క పోస్టర్ రిలీజ్ చేయలేదు.
దీంతో సంయుక్త ట్విట్టర్ వేదిక సాయి ధరమ్ అండ్ మూవీ టీంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
చిత్ర యూనిట్ రియాక్ట్ అవుతూ.. సారీ చెబుతూ త్వరలోనే రిలీజ్ చేస్తాం అంటూ ట్వీట్ చేశారు.
మా లక్కీ చార్మ్‌ని మర్చిపోయినందుకు సారీ, ఫస్ట్ సాంగ్‌తో తనని రివీల్ చేస్తామంటూ సాయి ధరమ్ ట్వీట్ చేశాడు.
కాగా ఇది ఫస్ట్ సాంగ్ ప్రమోషన్స్ కోసం చేసిన డ్రామా అని తెలుస్తుంది.