ఇంటర్వ్యూలో ఏడ్చేసిన  సమంత

సమంత చాలా గ్యాప్ తర్వాత యశోద అనే లేడీ ఓరియెంటెడ్ ఫుల్ లెంగ్త్ సినిమాతో రాబోతుంది.

యశోద సినిమా పాన్ ఇండియా వైడ్ నవంబర్ 11న విడుదల కానుంది.

ఇటీవల కొన్ని రోజుల క్రితం సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు, చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపింది.

సమంత యశోద సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సమంత యాంకర్ సుమకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఈ ఇంటర్వ్యూలో యశోద సినిమా గురించి, తన మయోసైటిస్ వ్యాధి గురించి మాట్లాడింది.

ఈ ఇంటర్వ్యూలో సమంత తన లైఫ్ పరిస్థితిని చెప్తూ ఎమోషనల్ అయి ఏడ్చేసింది. దీంతో ఈ ఇంటర్వ్యూ వైరల్ గా మారింది.