బైక్ ఆక్సిడెంట్ కావడంతో దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న సాయి ధరమ్ తేజ్..
ఇప్పుడు విరూపాక్ష అనే మిస్టిక్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు.
డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాని నిర్మిస్తూ కథని అందిస్తున్నాడు. అతడి శిష్యుడు కార్తీక్ దండు మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.
కాగా ఈ మూవీ టీజర్‌ని నేడు (మార్చ్ 1) రిలీజ్ చేస్తామంటూ ప్రకటించారు.
అయితే నిన్న బీమవరం సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ రావూరి పండు..
క్రికెట్ ఆడుతూ గుండెపోటు వచ్చి చనిపోయాడు.
ఇక ఈ విషయం తెలుసుకున్న సాయి ధరమ్.. అతని కుటుంబానికి సంతాపం వ్యక్తం చేయడమే కాకుండా, అభిమాని కోసం టీజర్ రిలీజ్‌ని కూడా పోస్ట్‌పోన్ చేశాడు.
సాయి ధరమ్ చేసిన పనికి నెటిజెన్లు హ్యాట్సాఫ్ అంటున్నారు.