పవన్ కళ్యాణ్, ఎస్ జె సూర్య కలయికలో వచ్చిన ఖుషీ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు.
ఈ సినిమా తరువాత ఎస్ జె సూర్య, పవన్‌తో పులి సినిమా డైరెక్ట్ చేశాడు.
కాగా పవన్‌ని తాను ఎంతగానో అభిమానిస్తా అంటూ సూర్య ఎన్నో సందర్భాల్లో చెప్పాడు.
తాజాగా పవన్ 27 ఏళ్ళ సినీ ప్రయాణాన్ని, 10 ఏళ్ళ రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకోవడంతో, పవన్‌ని అభినందిస్తూ ఒక వీడియో షేర్ చేశాడు.
పవన్ కళ్యాణ్ అనేది ఒక పేరు కాదు, అది ఒక నమ్మకం.
ప్రజలు కోసం ఆయన చేసే పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది.
ఆంధ్రప్రదేశ్ సీఎం పవన్ కళ్యాణ్ నా ఫ్రెండ్ అని గర్వంగా చెప్పుకునే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను.
ఇది నా ఒక్కడి కల కాదు. కొన్ని కోట్లమంది కల అంటూ చెప్పుకొచ్చాడు.