రాజమౌళి తెరకెక్కించిన RRR ఇంకా రికార్డులు సృష్టిస్తూనే ఉంది.
బియాండ్ ఫెస్ట్‌లో భాగంగా లాస్ ఏంజెల్స్‌లోని చైనీస్ ఐమాక్స్‌లో 'RRR'ని ప్రదర్శించారు.
దీంతో ఈ షో టిక్కెట్లు కేవలం 98 సెకన్లలోనే అమ్ముడుపోయి రికార్డు క్రియేట్ చేసింది.
ఈ ఫెస్ట్‌లో పాల్గొనేందుకు రామ్‌చరణ్ నేడు లాస్ ఏంజెల్స్ బయలుదేరాడు.
ఇక RRR సినిమా పలు కేటగిరీలో న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్ నామినేషన్స్‌లో నిలిచింది.
ఈ పురస్కారాల్లో రాజమౌళి బెస్ట్ డైరెక్టర్ అవార్డుని గెలుచుకున్నాడు.
ఈ అవార్డుల వేడుకలో రాజమౌళి భారతీయ సాంప్రదాయ లుక్‌లో పంచె కట్టుతో కనిపించాడు.
రాజమౌళి మాట్లాడుతూ.. 'సినిమా తనకి దేవాలయం' అంటూ వ్యాఖ్యానించాడు.