ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్ నామినేషన్స్ లో RRR, పొన్నియిన్ సెల్వన్ 1..
16వ ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్ ఈవెంట్ మార్చి 12న హాంకాంగ్ లో గ్రాండ్ గా జరగనుంది.
ఈ నేపథ్యంలో ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్ నామినేషన్స్ లో నిలిచిన సినిమాలని ప్రకటించారు.
ఆసియా ఖండంలోని అన్ని దేశాల నుంచి వచ్చిన సినిమాలని పరిశీలించి వివిధ విభాగాల్లో నామినేషన్స్ ని ప్రకటించారు.
ఈ ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్ నామినేషన్స్ లో భారతదేశం నుంచి పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా 6 విభాగాల్లో, RRR సినిమా 2 విభాగాల్లో నామినేట్ అయ్యాయి.
పొన్నియిన్ సెల్వన్ 1 సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఒరిజినల్ మ్యూజిక్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగాల్లో నామినేట్ అయింది.
ఆర్ఆర్ఆర్ సినిమా కేవలం ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ సౌండ్ విభాగాల్లో మాత్రమే నామినేట్ అవ్వడం గమనార్హం.
మరి ఈ రెండు సినిమాలకి ఏ విభాగాల్లో ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్ వరిస్తాయో చూడాలి.