రష్మిక మందన్న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది.

కాగా ఈ అమ్మడు.. తన చేతిపై ఉన్న టాటూ కథని అభిమానులకు తెలియజేసింది.

నేను కాలేజీ చదువుతున్న సమయంలో ఒక వ్యక్తి.. 'ఆడవాళ్లు సున్నితమైన వారు, సూది గుచ్చుకున్న తట్టుకోలేరు' అంటూ హేళన చేసి మాట్లాడాడు - రష్మిక

అతని మాటలు తప్పు అని నిరూపించడానికి నేను టాటూ వేసుకోవాలని నిర్ణయించుకున్నా  - రష్మిక 

టాటూ వేస్తున్న సమయంలో కలిగే బాధని భరించి చూపించాలి అని అనుకున్నా - రష్మిక

అయితే టాటూ ఏమని వేయించుకోవాలి అని చాలా ఆలోచించా - రష్మిక

మన జీవితంలో ఒకరి ప్లేస్‌ని మరొకరు రీప్లేస్ చేయలేరు అని నేను గట్టిగా నమ్ముతాను. ఎవరి ప్రత్యేకత వారిది - రష్మిక

అందుకనే ఆ మీనింగ్ వచ్చేలా.. ‘Irreplaceable’ అనే టాటూ వేయించుకున్నా - రష్మిక