స్టార్ హీరోయిన్ రష్మిక మందన మరో వివాదంలో చిక్కుకుంది.

ఇటీవలే కాంతార సినిమా విషయంలో.. కన్నడిగులు నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది.

ఆ వివాదం ముగిసింది అనుకునే లోపు మరో వివాదానికి తెర లేపింది రష్మిక.

ఈ భామ బాలీవుడ్‌లో 'మిషన్ మజ్ను' అనే సినిమా చేస్తుంది. 

ఆ సినిమాలోని రొమాంటిక్ సాంగ్‌ని లాంచ్ చేసే ఈవెంట్‌లో సౌత్ సినిమాలపై కామెంట్లు చేసింది.   

రొమాంటిక్ సాంగ్స్ అంటే బాలీవుడ్ సాంగ్స్ మాత్రమే. నా చిన్నప్పటి నుంచి బాలీవుడ్ సాంగ్స్ వింటూనే పెరిగా.

సౌత్‌లోని సినిమాల్లో.. అన్ని మాస్ మసాలా సాంగ్స్, ఐటమ్ నంబర్స్, డాన్స్ నంబర్స్ తప్ప ఇంకేమి ఉండవు.

లైఫ్ ఇచ్చిన సౌత్ మూవీలనే తక్కువ చేసి మాట్లాడడంతో, తీవ్ర విమర్శలు ఎదురుకుంటుంది రష్మిక.