రాశి ఖన్నా నటించిన బాలీవుడ్ వెబ్ సిరీస్ ‘ఫర్జి’ ఇటీవల రిలీజ్ అయ్యింది.
అది సూపర్ హిట్ అవ్వడంతో అక్కడ పలు ఇంటర్వ్యూలు ఇస్తుంది.
ఈ క్రమంలోనే బాహుబలి సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
బాహుబలి సినిమాలో తమన్నా చేసిన అవంతిక పాత్రని మొదట రాశి ఖన్నాకి ఆఫర్ చేశారట.
అందుకోసం రాశి ఆడిషన్ కూడా ఇచ్చిందట.
కానీ రాశి చాలా క్యూట్‌గా ఉందని, లవ్ స్టోరీకి అయితే సెట్ అవుతుందని రాజమౌళి రిజెక్ట్ చేశాడట.
అంతేకాదు తన ఫ్రెండ్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాకి రాశి సెట్ అవుతుందని రాజమౌళి రికమెండ్ చేశాడట.
అలా బాహుబలి అవకాశం కూలిపోయి టాలీవుడ్‌కి ‘ఊహలు గుసగుసలాడే’తో ఎంట్రీ ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది.