రానా, వెంకటేష్ నటించిన మొదటి వెబ్ సిరీస్ 'రానా నాయుడు'.

మార్చి 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ ప్రసారం కానుంది.

దీంతో కొన్ని రోజులుగా రానా ప్రమోషన్స్ చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో తాను ఇంకా సమంతతో టచ్‌లో ఉన్నట్లు తెలియజేశాడు.

సమయం కుదిరినప్పుడల్లా సమంతకి కాల్ చేసి తన విషయాలు తెలుసుకుంటాను అంటూ వెల్లడించాడు.

ఇటీవల మాయోసైటిస్ వ్యాధి వచ్చినప్పుడు కూడా తనకి కాల్ చేసి తన పరిస్థితి తెలుసుకున్నట్లు వెల్లడించాడు. రానా మాత్రమే కాదు నాగచైతన్యతో విడాకులు తరువాత..

అక్కినేని అఖిల్, సుశాంత్ కూడా సమంత అనారోగ్య సమయంలో ధైర్యం చెబుతూ కామెంట్లు చేశారు.

ఇప్పుడు రానా వ్యాఖ్యలు కూడా చూస్తుంటే సమంత.. అక్కినేని కుటుంబంతో మంచి రిలేషన్ మెయిన్‌టైన్ చేస్తుంది అని అర్ధమవుతుంది.