రామ్‌చరణ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే.

ఆస్కార్ ప్రమోషన్స్‌లో భాగంగా అక్కడ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు.

ఈ క్రమంలోనే తాజాగా పాపులర్ అమెరికన్ టాక్ షో ‘ఎంటర్‌టైన్‌మెంట్ టునైట్’కి గెస్ట్‌గా వెళ్ళాడు.

ఈ టాక్ షోలో ఆస్కార్ అందుకోడానికి మీరు రెడీగా ఉన్నారా? అని ప్రశ్నించగా..

చరణ్ బదులిస్తూ.. నిజానికి నేను ఒక యాక్టర్‌గా ఆస్కార్‌కి వెళ్లడం లేదు, ఒక ఫ్యాన్ బాయ్‌గా వెళ్తున్నాను అంటూ బదులిచ్చాడు.   

చరణ్ జవాబుకి, విలేకరి.. ఆస్కార్ వేడుకకు ఎంతోమంది వస్తారు, మీరు ఎవర్ని చూడడానికి వెళ్తున్నారు అంటూ ప్రశ్నించింది.

అందర్నీ చూడడానికి ఆసక్తిగానే ఉన్నాను. కానీ 'కేట్ బ్లాంచెట్'ని

'టామ్ క్రూజ్'ని మాత్రం కచ్చితంగా చూడాలని అనుకుంటున్నా అంటూ బదులిచ్చాడు.